హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీస్స్టేషన్లలో సిబ్బంది పనితీరును తెలుసుకునేందుకు ప్రజల స్పందన కోరుతున్నామని డీజీపీ జితేందర్ తెలిపారు. సీఐడీ డీజీ శిఖా గోయల్ నేతృత్వంలోని కొత్త సాంకేతిక విధానాన్ని అమలులోకి తీసుకొచ్చామని వెల్లడించారు. నూతన బ్రోచర్‌ను డీజీపీ సీఐడీ ప్రత్యేక సమావేశంలో ఆవిష్కరించారు.
సీఐడీ డీజీ శిఖాగోయల్, పోలీసు ఉన్నతాధికారులు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌లో డీజీపీ మాట్లాడారు. పోలీస్స్టేషన్లకు వచ్చే ప్రజలు తమ అభిప్రాయాలను క్యూఆర్ కోడ్ ద్వారా పంపాల్సి ఉంటుందని తెలిపారు. సమావేశంలో ఐజీపీలు ఎం రమేశ్, వీ సత్యనారాయణ, చంద్రశేఖర్‌రెడ్డి, రమేశ్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.