సంగారెడ్డి : అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని జిల్లా పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కోహీర్-కవేలి జాతీయ రహదారిపై బుధవారం ఉదయం పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ నుంచి గుజరాత్‌కు 720 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా గుర్తించిన పోలీసులు నాలుగు లారీలను సీజ్ చేశారు.
బియ్యం విలువ సుమారు రూ.11 లక్షలు ఉంటుందని, వాహనాల యజమానులు, డ్రైవర్లపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సురేశ్ తెలిపారు. ప్రభుత్వం సరఫరా చేసే రేషన్ బియ్యాన్ని ఎవరైనా అమ్మినా, కొన్నా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు.