హైదరాబాద్ : తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని ప్రాజెక్టులు నిండు కుండలా మారాయి. భారీ వర్షాలకు(Heavy rains) వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు మత్తడి దుంకుతున్నాయి. పలు చోట్ల చెట్లు, కరెంట్ స్తంభాలు నేలకొరిగాయి. పంటలు దెబ్బతిన్నాయి. వరదల్లో కొట్టుకుపోయి పలువురు మృతి చెందారు. తాజాగా మెదక్(Medak) జిల్లాలో వరదలో(Flood water) కొట్టుకుపోతున్న ఓ వ్యక్తిని పోలీసులు ప్రాణాలకు తెగించి(Police rescued) కాపాడారు. ఈ సంఘటన మెదక్ జిల్లా టెక్మాల్ పోలీస్ స్టేషన్ పరిధి గుండు వాగులో చోటుచేసుకుంది.
గత రెండు రోజులుగా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షానికి వాగులు పొంగి పొర్లుతున్నాయి. కాగా, గుండు వాగు దాటుతుండగా ప్రమాదవశాత్తు రమావత్ నందు అనే వ్యక్తి నీటిలో కొట్టుకుపోయాడు. వాగులో కొట్టుకుపోతూ ఓ బండ రాయిని పట్టుకొని ఆగిపోయాడు. ఈ క్రమంలో అతడిని గమనించిన మెదక్ జిల్లా పోలీసులు తాడు సహాయంతో బయటకు తీసుకొచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తమ ప్రాణాలను ఫణంగా పెట్టి వ్యక్తి ప్రాణాలను కాపాడిని పోలీసులను పలువురు అభినందించారు.
తమ ప్రాణాలను పణంగా పెట్టి వరద నీటిలో కొట్టుకుపోతున్న రమావత్ నందు అనే వ్యక్తిని కాపాడిన మెదక్ పోలీసులు
మెదక్ జిల్లా టెక్మాల్ పోలీస్ స్టేషన్ పరిది గుండు వాగులో చోటుచేసుకుంది. వాగు పొంగి పొర్లుతుండగా.. అటుగా వెళ్తున్న రమావత్ నందు నీటిలో కొట్టుకుపోయాడు.
వాగులో కొట్టుకుపోతూ.. వాగు… pic.twitter.com/MDcJ1ZuFEq
— Telugu Scribe (@TeluguScribe) September 3, 2024