సికింద్రాబాద్‌లోని రూబీ లాడ్జి అగ్నిప్రమాదం (Secunderabad Fire Accident) ఘటనలో పోలీసులు సీసీ కెమెరా పుటేజీని విడుదల చేశారు. బ్యాటరీ పేలుడు వల్లే పొగ వ్యాపించిందని పోలీసులు వెల్లడించారు. ఎలక్ట్రిక్ బైక్ షోరూం (Electric bikes showroom) యజమాని సుమిత్ సింగ్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు..షోరూం, లాడ్జిని సీజ్ చేశారు. పొగ బ్యాటరీల నుంచి 5వ అంతస్థుకు వ్యాపించిందని, పొగ వల్ల లాడ్జి రూంల్లో 8 మంది మృతి చెందగా..9 మంది అస్వస్థతకు లోనయ్యారని పోలీసులు తెలిపారు.
కాగా గాయాలైన వారిని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. ఈ ఘటనలో చనిపోయినవారు టూరిస్టులని సమాచారం. అగ్నిమాపక సిబ్బంది హైడ్రాలిక్ క్రేన్ సాయంతో లాడ్జిలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రమాదం ఘటనపై ప్రధాని స్పందిస్తూ..మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించారు.