హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): ఆహార కల్తీ వ్యవహారాల్లో తనిఖీలు నిర్వహించడం, నమూనాలు సేకరించడం, స్వాధీనం చర్యలు చేపట్టడం, కేసులు నమోదు చేయడం లాంటి అధికారాలు పోలీసులకు లేవని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. హైదరాబాద్లోని కాటేదాన్ ప్రాంతంలో కల్తీ పదార్థాలతో బిర్యానీ, మసాలా, అల్లం-వెల్లుల్లి పేస్టులను తయారు చేస్తున్నారంటూ మైలార్దేవ్పల్లి పోలీసులు కేసు నమోదు చేయడంపై ఫిరోజ్ అలీ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించడంతో జస్టిస్ జే శ్రీనివాసరావు విచారణ చేపట్టారు.
ఆహార కల్తీకి సంబంధించిన అంశాల్లో తనిఖీలు నిర్వహించడం, ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకోవడం, ప్రయోగశాలకు నమూనాలు పంపడం లాంటి చర్యలు తీసుకునే అధికారం ప్రత్యేకంగా ఆహార భద్రతాధికారికే ఉన్నదని స్పష్టం చేశారు.