రాజన్న సిరిసిల్ల, జూలై 1 (నమస్తే తెలంగాణ): రాజన్న సిరిసిల్ల జిల్లాలో ధాన్యం కుంభకోణం కేసులో పోలీసుల విచారణ కొనసాగుతున్నది. ఇప్పటికే అరెస్టయిన ఉత్కం విజయ్‌కుమా ర్, వాసాల గణేశ్, చేపూరి మధుకర్, కమ్మని రాజశేఖర్, గాజుల నవీన్, చి టుకుల శ్రీకాంత్, గడ్డం స్వామిని విచారించేందుకు వారంరోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని ఇటీవల సిరిసిల్ల కోర్టులో పోలీసులు పిటిషన్ వేయగా, బుధవారం సిరిసిల్ల జ్యుడీషియల్ మె జిస్ట్రేట్ గడ్డం మేఘన విచారించారు. నిందితులను రెండురోజులపాటు పోలీ స్ కస్టడీకి అనుమతించారు. నిందితు లు నోరువిప్పితే ఇందులో ఎంతమంది పాత్ర ఉందో..? ఎవరు సూత్రధారులో తేలే అవకాశం ఉన్నది.
హైదరాబాద్, జూలై 1(నమస్తే తెలంగాణ) : సన్నధాన్యం విక్రయించేందుకు నిర్వహించిన టెండర్‌ను సివిల్ సప్లయ్ రద్దు చేసింది. వేలంలో బేస్ ప్రైజ్(కనీస ధర) కన్నా తక్కువ ధర రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. దీంతో బిడ్డర్ల ఈఎండీని తిరిగి చెల్లిస్తామని తెలిపింది. 2025-26 వానకాలానికి సంబంధించిన 5 లక్షల టన్నుల సన్నధాన్యాన్ని వేలం ద్వారా విక్రయించాలని సివిల్ సప్లయ్ కార్పొరేషన్ నిర్ణయించింది. ఈ మేరకు జూన్ 20న నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందుకు క్వింటాల్‌కు కనీస ధరను రూ.3,405గా నిర్ణయించింది. కాగా, మంగళవారం ఓపెన్ చేసిన బిడ్డింగ్‌లో కనీస ధర కన్నా తక్కువ ధర రావడంతో టెండర్‌ను రద్దుచేశారు.