నాంపల్లి క్రిమినల్ కోర్టులు, జనవరి 2 (నమస్తే తెలంగాణ)/కొడంగల్ : వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల రైతులతోపాటు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డిపై నమోదైన కేసులో బొంరాస్పే ట్ పోలీసులు విచారణ చేపట్టారు. ఫా ర్మా క్లస్టర్ నిర్మాణం కోసం భూముల్ని ఇవ్వాలని ప్రభుత్వం తరఫున కొనసాగుతున్న సర్వేలను వ్యతిరేకించడంతో మాజీ ఎమ్మెల్యే పట్నం పేరును సైతం చేర్చిన విషయం తెల్సిందే.
మాజీ ఎమ్మెల్యేకు ఇటీవల షరతులతో కూ డిన బెయిల్ మంజూరైంది. క్రైమ్ నం బర్ 145 కేసులో విచారణకు హాజరుకావాలని జారీ చేసిన నోటీసుల మేరకు గురువారం ఆయన బొంరాస్పేట్ పోలీస్ స్టేషన్కు వెళ్లి విచారణ అధికారి అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇచ్చారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినట్టు సమాచారం. కక్షపూరితంగా తనపై కేసు నమోదు చేసినట్టు పట్నం చెప్పినట్టు తెలిసింది. విచారణ దాదాపు 3 గంటలపాటు సాగింది.