మంచిర్యాల : మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం ఎర్రాయిపేట గ్రామం సమీపంలోని గోదావరి నదిలో గల్లంతైన ఉపాధ్యాయుడు కోసం గాలింపు చర్యలను పోలీసులు ముమ్మరం చేశారు. ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న బిజూ, టోని అనే ఇద్దరూ నిన్న సాయంత్రం గోదావరి నదిలో స్నానానికి వెళ్లి గల్లంతయ్యారు. వీరిలో బిజూ మృతదేహం నిన్ననే లభించింది. నదిలో గల్లంతైన మరో ఉపాధ్యాయుడు టోని కోసం నాటు పడవలు, గజ ఈతగాళ్లతో గాలింపు ముమ్మరం చేశారు. గోదావరి కోటపల్లి ఎస్ఐ వెంకట్ పర్యవేక్షణలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా నిన్న లభించిన బిజూ మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.