చింతలమానేపల్లి, ఫిబ్రవరి 1 : కేసీఆర్కు సిట్ నోటీసులివ్వడాన్ని నిరసిస్తూ కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లిలో ఆందోళనలు చేపట్టిన బీఆర్ఎస్ శ్రేణులపై పోలీసులు అక్రమ కేసులు పెట్టారు.
చింతలమానేపల్లి మండల కేంద్రంలోని శివాజీ చౌక్ వద్ద అనుమతి లేకుండా రహదారిని అడ్డగించి, సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసినందుకు 12 మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై ఇస్లావత్ నరేశ్ తెలిపారు.