లగచర్ల రైతులపై నమోదైన కేసులో రెండో ముద్దాయిగా ఉన్న సురేశ్‌ను 4 రోజులపాటు కస్టడీకి అప్పగించాలని కోరుతూ బొంరాస్‌పేట్ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం ఇన్చార్జి ఏసీబీ కోర్టు జడ్జీ మహ్మద్ అఫ్రోజ్ అక్తర్ తీర్పును వెలువరించనున్నారు. ఇటీవల నిందితుడి తరఫున దా ఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై సీనియ ర్ న్యాయవాది ఏకాంబరమ్ వాదనలు వినిపించారు. పోలీసుల తరఫున పీపీ వాదనలు పూర్తి చేయాల్సి ఉన్నది. ఇద్దరిని కూడా కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.
హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ): లగచర్లలో అధికారులపై దాడికి సంబంధించిన కేసులో ముంద స్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ 12 మంది రైతులు హైకోర్టు ను ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు గు రువారం విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వానికి, బొమ్రాస్పేట పోలీసుల కు నోటీసులు జారీచేసింది. సమగ్ర వి వరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను న్యాయమూర్తి జస్టిస్ కే లక్ష్మణ్ ఈ నెల 9కి వాయిదా వేశారు.