సిద్దిపేట : వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కాన్వాయ్‌ని పోలీసులు మంగళవారం తనిఖీ చేశారు.
సిద్దిపేట జిల్లా పొన్నాల ప్రధాన రహదారి వద్ద ఎన్నికల విధి నిర్వహణలో భాగంగా పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికల నిబంధనలను అనుసరించి పోలీసులకు మంత్రి హరీశ్ రావు పూర్తిగా సహకరించారు. మంత్రి వాహనంతో పాటు ఆయన వెంట ఉన్న ఇతర వాహనాలను సైతం పోలీసులు చెక్ చేశారు. తనిఖీకి సహకరించిన మంత్రికి పోలీసులు ధన్యవాదాలు తెలిపారు.