ఖలీల్‌వాడి, నవంబర్ 3: ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్‌ను నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పోలీసులు గురువారం తనిఖీ చేశారు. ఆదిలాబాద్ జిల్లా భైంసాలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొనేందుకు హెలికాప్టర్లో వెళ్లగా.. ఆయన కాన్వాయ్ రోడ్డుమార్గంలో వెళ్లింది. తిరుగు ప్రయాణంలో కాన్వాయ్‌లోని వాహనాలు నిజామాబాద్ మీదుగా హైదరాబాద్‌కు వెళ్తుండగా.. నగరంలోని బైపాస్‌రోడ్‌లోని పోలీస్ పికెట్ పాయింట్ వద్ద పోలీసులు ఆపారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఆపి లోపల తనిఖీలు చేశారు.