బంజారాహిల్స్, మార్చి 18: తన వద్ద పనిచేస్తున్న ఓ ఉద్యోగిని నిర్బంధించిన ఘటనలో రియల్ఎస్టేట్ సంస్థ సుచిర్ ఇండియా ఎండీ వై కిరణ్‌పై కేసు నమోదైంది. ఉద్యోగి బుస ప్రియాంక్ వరంగల్ వెంచర్ సంబంధించిన లెక్కల్లో రూ. 5 లక్షలు వాడుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. సోమవారం తనను సంస్థ ఎండీ కిరణ్ పిలిపించి గదిలో నిర్బంధిం చారని, 5 లక్షలు కట్టకపోతే నీ అంతుచూస్తానని బెదిరించారంటూ 100కు ఫోన్‌చేసి తెలుపగా, పోలీసులు విడిపించారని ప్రియాంక్ పేర్కొన్నాడు.
మంగళవారం బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదుచేశారు. తాను వచ్చేవరకు ఆఫీసులో ఉండాలన్నానని, ప్రయాంక్ నిర్బంధం డ్రామా ఆడాడని, అతని మోసాలకు అన్ని ఆడియో, వీడియో ఆధారాలు ఉన్నాయని కిరణ్ చెప్పారు.