Gadwal | గద్వాల : ఎక్కడైన అధికారులు అక్రమ ఇసుక రవాణ చేస్తే వాహనాలను పట్టుకుని కేసులు నమోదు చేస్తారు.. కానీ ఇసుక కొట్టకున్నా అధికారులు ట్రాక్టర్లు సీజ్ చేసి కేసులు నమోదు చేశారంటూ కేటిదొడ్డి మండలానికి చెందిన ఓ బాధితుడు ఆరోపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బాధితుడి కథనం మేరకు… గత నెలలో ఇసుక రవాణా చేయకున్న…అక్రమ రవాణా చేస్తున్నట్లు పోలీసులు ట్రాక్టర్లను స్టేషన్కు తరలించి కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకోవచ్చని, కానీ రవాణా చేయకుండానే ట్రాక్టర్లను పోలీసులు తీసుకెళ్లడంపై అనుమానం వ్యక్తం చేశాడు. ఇటీవల కేటిదొడ్డి మండలానికి చెందిన ఓ వ్యక్తి అక్రమ ఇసుక రవాణ చేస్తున్న క్రమంలో పోలీసులు పట్టుకుని వదిలి పెట్టడం జరిగిందని, తాజాగా మరోసారి పట్టుకుని కేసు నమోదు చేసి తహసీల్దార్ కార్యాలయానికి అప్పగించడం జరిగిందన్నారు. పోలీసులను ప్రశ్నించినందుకే.. ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేనప్పటికీ తన ట్రాక్టర్ను సీజ్ చేశారని, దీనిపై జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని బాధితుడు పేర్కొన్నారు.
ఈ వ్యవహారంపై ఎస్ఐ బి శ్రీనివాసులును వివరణగా కోరగా… ఇసుక అక్రమ రవాణా చేసే ఎంతటివారినైనా ఊపేక్షించేది లేదన్నారు. ఉద్దేశపూర్వకంగా కేసులు నమోదు చేశారంటూ వస్తున్న ఆరోపణలు అవాస్తమన్నారు. గత నెలలోనే అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లపై కేసు నమోదు చేసి కోర్టుకు డిపాజిట్ చేయడం జరిగిందన్నారు. కాగ గత జనవరి నెలలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న క్రమంలో ట్రాక్టర్లను పోలీసులు పట్టుకోగా… తాజాగ వాటిపై కేసు నమోదు చేయడం కొసమెరుపు.