మట్టెవాడ, ఆగస్టు 11: వరంగల్ ఎంజీఎంలో శిశువును కుక్కలు పీక్కుతిన్న ఘటనను నిరసిస్తూ దవాఖాన ఎదుట ధర్నా చేసిన తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్తోపాటు తొమ్మిది మందిపై మట్టెవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. మూడురోజుల క్రితం ఎంజీఎంలో శిశువును కుక్కలు పీక్కుతిన్న ఘటనను నిరసిస్తూ శనివారం మాజీ ఎమ్మెల్యే నరేందర్ తన కార్యకర్తలతో దవాఖాన గేటు ఎదుట ధర్నా చేశారు.
పోలీసుల అనుమతి లేకుండా ధర్నా చేసినందుకు మాజీ ఎమ్మెల్యేతోపాటు 34వ డివిజన్ కార్పొరేటర్ కుమారస్వామి, రవి, కొంగ రాజేందర్, ఎలగంటి సతీశ్, ఎలగంటి మధు, సీతారాం, బజ్జూరి వాసు, తోట స్రవంతిపై కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.
విద్యుత్తు షాక్తో రైతు మృతి
ఇనుగుర్తి, ఆగస్టు 11: మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలంలోని చిన్నముప్పారంలో ఆదివారం విద్యుత్తు షాక్తో రైతు మృతి చెందా డు. గ్రామానికి చెందిన దర్శనం సోమయ్య (55) పొలంలో పనులు చేస్తుండగా బావి మోటర్ సర్వీస్ వైరు కాలికి తగిలి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు.