బుధవారం 24 ఫిబ్రవరి 2021
Telangana - Jan 16, 2021 , 01:15:27

అభ్యుదయ కవి రుద్రశ్రీ ఇకలేరు

అభ్యుదయ కవి రుద్రశ్రీ ఇకలేరు

నివాళులర్పించిన సాహితీలోకం

జనగామ, జనవరి 15 ( నమస్తే తెలంగాణ): ప్రముఖకవి, రిటైర్డ్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ చిట్టిమల్లే శంకరయ్య(87) అనారోగ్యంతో శుక్ర వారం జనగామలోని తన నివాసంలో కన్నుమూశారు. చేనేత, ఆయుర్వేద వైద్యులు చిట్టిమల్లె వెం కటయ్య-మహాలక్ష్మి దంపతులకు 1934 ఏప్రిల్‌ 15న శంకరయ్య జన్మించారు. 1972 నుంచి జనగామ ఆంధ్ర భాషాభివర్ధిని డిగ్రీ కాలేజీలో తెలుగు అధ్యాపకులుగా పనిచేసి 1996లో ఉద్యోగవిరమణ చేశారు. తెలుగు సాహితీ, సాంస్కృతిక రంగంలో రుద్రశ్రీగా సుపరిచితులు. ‘అరాత్రికం, ఇంద్రచాపం, విశ్వసుందరి, బర్డ్‌ ఆఫ్‌ ప్యారడైజ్‌, అమృతబిందువు, రూపాయి ఆత్మకథ, ప్రేమగజళ్లు’ కవితా సంపుటాలు ప్రచురితమయ్యాయి. ముత్యాల సరాల మహాకవి గురజాడ (విమర్శ)తోపాటు తెలుగు సాహిత్యంలో దేశీయవైద్యం అనే అంశంపై ఎంఫిల్‌ పరిశోధన గ్రంథం, ‘ఆంధ్ర సాహిత్యంలో ఆ యుర్వేదం’పై పీహెచ్‌డీ సిద్ధాంత గ్రంథం రాశారు. భావవాద కవిగా మొదలైన ఆయన ఉద్యమాల ప్రభావంతో అభ్యుదయ కవిగా ప్రస్థానం కొనసాగించారు.  రుద్రశ్రీకి సాహితీలోకం, జనగామ రచయితల సంఘం నివాళులర్పించాయి. 

VIDEOS

logo