ష్! నన్నెవ్వరు ఆటంకపరచకండి
ప్రజాస్వామ్యం చిరునామా
వెదకడంలో బిజీగా ఉన్న
కాని ఎంత వెదికినా.. ఫ్చ్ లాభం శూన్యం
చిరునామా మారిందా? డెఫనేషన్ మారిందా?
ఆశ్చర్యం లేదేమో.. ఏది మారినా?
అనుమానం అవసరం లేదని
నా అంతరాత్మ హెచ్చరిస్తున్నది
ఎందుకంటారా..!
ప్రస్తుతం ప్రజాస్వామ్యమంటే
పార్టీస్వామ్యం కదా!
వీళ్ళంతా నిద్ర నటించేవాళ్ళు
నేలతల్లికి రైతన్నలకుండే
అవినాభావం సంబంధం
ముమ్మాటికీ అర్థం కాదు…
సారి అర్థం కానట్లు నటిస్తారు!
అదేమి అల్లాఉద్దీన్ అద్భుత దీపమా
మీ ఆజ్ఞానుసారం పంటను తీయడానికి
దానికీ దేశ కాలాలతో సంబంధం
పంజాబు నేల గోదుమ.. కశ్మీరుకు యాపిలు
ఈ నేలకు సాధ్యం కాదని తెలియదా?
మంత్రదండం మీ చేతిలో ఉంటే
మా వరిని ఆ పంటలతో తారుమారు చేయండి
మేమందుకు సిధ్ధమే
కేంద్రానికిచ్చిన మాటను రాష్ట్రం మరువలేదు
రైతన్నల అనివార్యతను అర్థం చేసుకొన్నది
అందుకే మీతో భేటీ
ఐనా తెలంగాణలో నీ పార్టీ బిడ్డలున్నారని
నీ పార్టీకి ఓటేసినవాళ్ళున్నారని మరిస్తే ఎట్లా?
ఒక దేశాధినేత
ప్రమాణస్వీకారాంశాలకు నీళ్ళొదిలి
అంతఃకరణశుధ్ధిని గాలికొదిలేసి
నూకలుతినే అలవాటు చేసుకోమనడం
అవివేకమా? అజ్ఞానమా? అహంకారమా?
త్రీ ఇన్ వన్నా? మీరే తేల్చుకోవాలె
కళ్ళుమూసుకొని పాలు తాగే పిల్లులు కాకండి
ప్రజలంతా చూస్తున్నారు.. ఫలితం తప్పదు.
-తిరునగరి దేవకి