రుద్రంగి, ఆగస్టు 24 : రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల రైతులు యూరి యా కోసం ముప్పుతిప్పలు పడుతున్నారు. యూరియా కోసం వ్యవసాయ పనులు వదులుకొని సోమవారం ఉదయం నుంచే రైతు వేదిక వద్ద బారులు తీరారు. బుకింగ్ కావడం లేదంటూ రుద్రంగిలోని రైతు వేదిక వద్ద ఉమ్మడి మానాల, గిరిజనతండా గ్రామాల రైతులు పోడు భూముల ప్రొసీడింగ్ పత్రాలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఉమ్మడి మానాల గిరిజన రై తులకు పోడు భూముల ప్రొసీడింగ్ కాపీ లు అందించారని, అవే పత్రాలతో ఇప్పటివరకు యూరియా కొనుగోలు చేశామని పే ర్కొన్నారు.
ఇప్పుడు ఆన్లైన్ కావడంలేద ని, వ్యవసాయ పనులను వదిలి పది రోజులుగా ఫర్టిలైజర్స్ షాపులకు వెళ్తే వ్యవసాయ అధికారుల వద్దకు వెళ్లాలని చెప్తున్నారని అన్నారు. అధికారుల దగ్గరికి వెళ్లినప్పటికీ ఆన్లైన్ కావడం లేదని వాపోయారు. స్టేట్ లెవల్ యాప్ ద్వారా పోడు భూములకు యూరియా ఇచ్చామని, ప్రస్తుతం సెంట్రె ల్ యాప్లో ఆన్లైన్ నమోదు చేస్తున్నామ ని, అందులో పోడు భూములకు యూ రి యా ఇవ్వడం లేదని అధికారులు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.