నల్లగొండ : జిల్లాలోని నాంపల్లి తహసీల్ కార్యాలయం ( Tahsildar Office ) పై సోమ వారం ఏసీబీ అధికారులు దాడులు ( ACB Raid) నిర్వహించారు. లంచం తీసుకుంటూ ఆర్ఐ గోపరాజు ( RI Goparaju ) ను , అతని అసిస్టెంట్ యాదగిరిని అరెస్టు చేశారు.
మండలంలోని ఓ రైతు పౌతి కోసం ఆర్ఐని సంప్రదించగా లంచం డిమాండ్ చేశాడు. సోమవారం అతడి అసిసెంట్ యాదగిరి రూ.15 వేలు తీసుకుని ఆర్ఐకి అప్పగించగా అక్కడే ఉన్న ఏసీబీ అధికారులు ఇద్దరిని రెడ్ హ్యండెడ్గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వివరించారు.