Slumdog – 33 Temple Road | టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి కాంబినేషన్లో వస్తోన్న మూవీ ‘స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్’ (Slumdog – 33 Temple Road). ఒక్క వాన పడితే కాకుల్లా చెట్ల కింద దాక్కునే జీవితాలు మావి అలాంటి మా బతుకులతో ఆడితే నేనెందుకు వదులుతా అంటూ ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ నెట్టింట హైప్ పెంచేస్తోంది.
తాజాగా ఈ మూవీ నుంచి జరీనా వహబ్ గ్లింప్స్‌ను షేర్ చేసింది పూరీ టీం. నాంపల్లి స్టేషన్‌కు వెళ్లి ట్రైన్ కింద తలపెట్టి చచ్చిపోదామనుకున్నాను. కానీ ధైర్యం సరిపోలేదు. ఈ ఆకలి ముందు అన్నీ ఓడిపోతాయి రా.. సిగ్గు, లజ్జా, మానం, మర్యాద అన్నీ మంటకలిసిపోతాయి. కానీ బేటా ఆకలితో ప్రాణాలు తోడేస్తుంటే నాకు తెలియకుండానే నా చేతులు అడుక్కోవడం మొదలుపెట్టాయి.. అంటూ జరీనా వహబ్ చెబుతున్న డైలాగ్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. పూరీ మార్క్ డైలాగ్స్‌తో సినిమా ఉండబోతున్నట్టు తాజా గ్లింప్స్ చెప్పకనే చెబుతోంది.
ఈ చిత్రానికి రమీ (Ramee) సంగీతం అందిస్తున్నాడు. ఛార్మి కౌర్ సమర్పకురాలిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్, జె.బి. మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్, జె.బి. నారాయణరావు కొండ్రోళ్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ మూవీ విజయ్ సేతుపతికి జోడీగా సంయుక్తా మీనన్ నటిస్తుండగా.. టబు, దునియా విజయ్, బ్రహ్మాజీ, వి.టి.వి. గణేష్, విష్ణు రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్లో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కానుంది.
UPI Transactions: యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్.. తాత్కాలిక స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరణ
KTR | పట్టాలివ్వకపోతే ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ రాళ్లతో కొట్టుమన్నడు.. రైతులతో కేటీఆర్
PYL Secretary | భగత్‌సింగ్ స్ఫూర్తితో యువత ఉద్యమించాలి : పీవైఎస్ కార్యదర్శి