Jagadish Reddy | పట్టభద్రులైన ప్రతి ఒక్కరు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి
Jagadish Reddy | పట్టభద్రులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి కోరారు.
సూర్యాపేట : పట్టభద్రులైన ( Graduate ) ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి (Jagadish Reddy) కోరారు. పట్టభద్రుల (MLC) ఎన్నికలను పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా కేంద్రం వాణిజ్య భవన్ సెంటర్లో ఓటర్ నమోదు కేంద్రాన్ని (హెల్ప్ డెస్క్) ఆయన ప్రారంభించి , సతీసమేతంగా ఓటు హక్కు నమోదు చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పోరాట పటిమ ఎట్లా కొనసాగుతుందో ప్రతి పట్టభద్రుడు గమనించాలని సూచించారు. గతంలో ఉన్న గ్రాడ్యుయేట్ ఓటర్ లిస్టు పూర్తిగా రద్దయిం దని, పాత, కొత్త ప్రతి ఓటరు తప్పనిసరిగా తమ ఓటు నమోదు చేసుకోవాలని కోరారు.
ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల ఎమ్మెల్సీ ఓటు హక్కు కోసం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ప్రారంభించామని వెల్లడించారు. అందుకోసం కావలసిన అన్ని సౌకర్యాలు ఏర్పాటుచేశామని తెలిపారు. విశ్రాంత ఉద్యోగులు, ప్రస్తుత ఉద్యోగులు, నిరుద్యోగ యువత, వ్యాపారులు పట్టభద్రులైన ప్రతి ఒక్కరూ ఓటును నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
డీప్‌ఫేక్ వీడియోలతో ఎంఐఎం బహిష్కృత ఎమ్మెల్సీకి బెదిరింపులు.. రూ.5 కోట్లు డిమాండ్ చేసిన ముఠా!
Vijayasai Reddy | వైఎస్ జగన్‌ను వదిలి వెళ్లలేదు..వెళ్లేలా కొందరు చేశారు : విజయసాయిరెడ్డి
భాగ్యశ్రీ బోర్సే వయ్యారాల విందు.. హాట్ హాట్ ఫొటోలతో ఇంటర్నెట్లో రచ్చ!
Centre earns Rs 970 crore from scrap | నెల రోజుల పాటు వ్యర్థాల తొలగింపు.. ఆరో విడతలో కేంద్రానికి రూ. 970 కోట్ల ఆదాయం
IKP Centers | ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

