దిందాలో పోడు భూముల రగడ.. భూములను చదును చేసేందుకు ప్రయత్నించిన అటవీ అధికారులు
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పోడు భూముల వివాదం కొనసాగుతూనే ఉన్నది. తాజాగా.. చింతలమానేపల్లి మండలం బండెపల్లి ఫారెస్ట్ బీట్‌లోని దిందా (ఖర్జెల్లి) అటవీ ప్రాంత సమీపంలో మంగళవారం అటవీ అధికారులు, రైతులకు మధ్య వివాదం చోటుచేసుకున్నది.
- అడ్డుకొన్న రైతులు.. ఈడ్చుకెళ్లిన ఆఫీసర్లు.. సొమ్మసిల్లిన రైతు
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ) : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పోడు భూముల వివాదం కొనసాగుతూనే ఉన్నది. తాజాగా.. చింతలమానేపల్లి మండలం బండెపల్లి ఫారెస్ట్ బీట్‌లోని దిందా (ఖర్జెల్లి) అటవీ ప్రాంత సమీపంలో మంగళవారం అటవీ అధికారులు, రైతులకు మధ్య వివాదం చోటుచేసుకున్నది. ఈ ప్రాంతంలో సుమారు 2 వేల ఎకరాల భూముల్లో రైతులు పోడు వ్యవసాయం చేస్తున్నారు. పోడు భూముల్లోని కొన్ని ప్రాంతాల్లో ఇటీవల అటవీ అధికారులు ట్రెంచ్‌లు తవ్వారు. ట్రెంచ్‌లకు లోపలి వైపు రైతులు సాగు చేయరాదని రైతులకు అవగాహన కల్పించారు. ప్రస్తుతం వానకాలం ప్రారంభం కావడంతో కొందరు రైతులు అటవీ అధికారులు తవ్విన ట్రెంచ్‌లను దాటుకొని వెళ్లి సాగు చేసేందుకు విత్తనాలు కూడా వేశారు. గమనించిన అటవీ అధికారులు భూములను చదును చేసి అటవీ మొక్కలను నాటేందుకు ప్రయత్నించారు.
విషయం తెలిసి వందకుపైగా రైతుల కుటుంబాలు తరలివచ్చి అటవీ అధికారులను అడ్డుకున్నారు. అటవీ అధికారులు పోలీసుల సహకారంతో రైతులను ఈడ్చుకెళ్లి జీపుల్లో ఎక్కించారు. తోపులాటలో ఓ రైతు సొమ్మసిల్లిపడిపోయాడు. మహిళలను తోసివేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సుమారు 20 మంది రైతులు, మహిళలను కాగజ్‌నగర్ డీఎఫ్‌వో కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ.. దిందా, ఖర్జెల్లి ప్రాంతాల్లో పోడు చేసుకుంటున్న తమను అటవీ అధికారులు వేధిస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రాంతంలో ఎక్కువ భూములు ఉన్న నాయకులను వదిలేసి రెండు, మూడు ఎకరాలు సాగు చేసుకుంటున్న రైతుల వద్ద ఉన్న భూములనే అటవీ అధికారులు గుంజుకునే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. అసిస్టెంట్ ఫారెస్ట్ కన్జర్వేటర్ అప్పయ్య మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో 31 శాతం అడవులు ఆక్రమణకు గురయ్యాయని, దీంతో అటవీ జంతువులు జనావాసాల్లోకి వస్తున్నాయని తెలిపారు. ఆక్రమణల వల్ల తెగిపోయిన అడవుల లింక్‌ను కలిపే ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పారు. ఖర్జెల్లి అటవీ ప్రాంతంలో పనులను కొందరు రైతులు అడ్డుకొన్నారని, వారిని కొట్టలేదని, కౌన్సెలింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Uttarakhand | సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి..! ఉత్తరాఖండ్ మహిళా మంత్రిపై భర్త ఆరోపణలు
RTC Elections | ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు తారుమారు?.. కాంగ్రెస్ అనుబంధ సంఘానికి కట్టబెట్టే యత్నం
Delhi Police | పోలీసుల దాష్టీకాలపై కదం తొక్కిన మహిళలు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
Gold price | బంగారం మళ్లీ ఆల్‌టైమ్ హై?.. వచ్చే రెండేండ్లలో చేరవచ్చన్న అంచనాలు
Nitish Kumar | నితీశ్ కోసం తొమ్మిది హత్యలు చేశా.. జేడీయూ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

