డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీలో చేతివాటం
డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీలో అధికార పార్టీకి చెందిన కొంతమంది చేతివాటం ప్రదర్శించారు. 150 మంది లబ్ధిదారుల నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేసుకున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి.
- 131 మంది లబ్ధిదారుల జాబితా తారుమారు
- అక్రమాలు బయటకు వస్తాయనే సీపీఎం నేతల అరెస్ట్
నీలగిరి, ఆగస్టు 15: డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీలో అధికార పార్టీకి చెందిన కొంతమంది చేతివాటం ప్రదర్శించారు. 150 మంది లబ్ధిదారుల నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేసుకున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. డబుల్ బెడ్రూమ్ ఇండ్లసాధన కమిటీ పేరుతో అందోళనలు చేసిన సీపీఎం నేతలు ఈ అక్రమాలను సభ వద్ద బయలు చేస్తారనే భయంతో స్వాతంత్య్ర దినోత్సవం రోజున సీపీఎం కార్యాలయంలోకి వెళ్లి మందస్తు అరెస్టులు చేశారు.
వివరాల్లోకి వెళితే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కలల సౌధంలో ఒకటైన డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం కోసం పట్టణ శివారులోని కలెక్టరేట్ సమీపంలో 24 బ్లాకుల్లో 576 ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అందులో తాగునీరు, రోడ్లు, ఇతర పలు మౌలిక సదుపాయాల కల్పన కోసం రెండున్నర సంవత్సరాల పాటు ప్రస్తుత అధికార పార్టీ నాయకులు సమయం తీసుకుని వాటిని పూర్తి చేశారు. శనివారం వాటిని పంపిణీ చేయాలని నిర్ణయించారు.
రీ సర్వేలో పేర్లు మార్చిన విధానం, 131 మంది జాబితాను మార్చడంపై డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ సందర్భంగా ఆందోళన చేస్తారని ముందస్తుగా సీపీఎం నేతలను అరెస్ట్ చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం అనే విషయాన్ని మర్చిన పోలీసులు ఏకంగా పార్టీ కార్యాలయంలోకి చొరబడి మరీ అరెస్టు చేయడం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. 2017లో ప్రారంభించిన డబుల్ బెడ్రూమ్లను 2023లో 24 బ్లాకుల్లో 576 గృహాలుగా పూర్తిచేశారు.
20వేలకు పైగా దరఖాస్తులు రాగా 552 మందిని ఎంపిక చేశారు. అధికారంలోకి కాంగ్రెస్ రావడంతో వాటిని పక్కన పెట్టారు. సీపీఎం, బీఆర్ఎస్ నేతలు వాటిని పంపిణీ చేయాలని పలుమార్లు ఆందోళనలు చేశారు. దీంతో అధికారులు గత నవంబర్‌లో రీ సర్వే చేపట్టారు. ఎంపిక చేసిన 421 మంది లబ్ధిదారుల్లో నుంచి 30 మంది వరకు తొలగించారు. వీరే కాకుండా వివిధ కారణాలతో ఎంపిక చేసిన 131 మంది జాబితాను మార్చి అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న వారి పేర్లు జాబితాలో చేర్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rythu Garjana Sabha | బీఆర్ఎస్ రైతు గర్జన పోస్టర్ ఆవిష్కరణ.. ఈ నెల 11న నిర్మల్‌లో కేటీఆర్ సభ
డీప్‌ఫేక్ వీడియోలతో ఎంఐఎం బహిష్కృత ఎమ్మెల్సీకి బెదిరింపులు.. రూ.5 కోట్లు డిమాండ్ చేసిన ముఠా!
Vijayasai Reddy | వైఎస్ జగన్‌ను వదిలి వెళ్లలేదు..వెళ్లేలా కొందరు చేశారు : విజయసాయిరెడ్డి
భాగ్యశ్రీ బోర్సే వయ్యారాల విందు.. హాట్ హాట్ ఫొటోలతో ఇంటర్నెట్లో రచ్చ!
Centre earns Rs 970 crore from scrap | నెల రోజుల పాటు వ్యర్థాల తొలగింపు.. ఆరో విడతలో కేంద్రానికి రూ. 970 కోట్ల ఆదాయం
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

