కుమ్రంభీం ఆసిఫాబాద్ : కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా( Asifabad Dist) ఆసిఫాబాద్ మండలం దానాపూర్‌లో(Dhanapur) ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అటవీశాఖ అధికారులు, పోడు రైతుల(Podu farmers) మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దానాపూర్ గ్రామ పరిధిలో తరతరాలుగా తమ సాగు చేసుకుంటున్న భూముల్లో సర్వేలు నిర్వహించడానికి వచ్చిన అటవీశాఖ అధికారులను(Forest officials) పోడు రైతులు అడ్డుకున్నారు. ఈ గ్రామం పరిధిలో దాదాపు 160 ఎకరాల భూమిని ఈ గ్రామానికి చెందిన దాదాపు 60 కుటుంబాల రైతులు సాగు చేసుకుంటున్నారు. ఈ భూములను స్వాధీనం చేసుకునేందుకు అటవీశాఖ అధికారులు శుక్రవారం దానాపూర్ వెళ్లగా గ్రామస్తులు వారిని అడ్డుకోవడంతో అటవీ అధికారులు వెనుతిరిగారు.