R.S. Praveen Kumar | రేవంత్, బండి సంజయ్ చీకటి స్నేహం వల్లే ఫోక్సోకేసు బలహీనం : ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
R.S. Praveen Kumar | లంగాణ సమాజాన్ని కుదిపేసిన ఫోక్సో కేసు రేవంత్ రెడ్డి బండి సంజయ్ చీకటి స్నేహం వల్లే బలహీనపడ్డదని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.
వనపర్తి : తెలంగాణ సమాజాన్ని కుదిపేసిన ఫోక్సో కేసు ( POCSO Case) రేవంత్ రెడ్డి ( Revanth), బండి సంజయ్ ( Bandi Sanjay ) చీకటి స్నేహం వల్లే బలహీనపడ్డదని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ( R.S. Praveen Kumar ) ఆరోపించారు. బుధవారం వనపర్తిలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సనాతన ధర్మం పేరిట ప్రచారం నిర్వహిస్తూనే హిందూ అమ్మాయిల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బండి సాయి భగీరథ్ ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నేరం చేసిన వ్యక్తి తండ్రికి పోలీసులు నోటీసులు ఇవ్వకుండా మేనమామకు ఇవ్వడంలో ఔచిత్యం ఏమిటని ప్రశ్నించారు. కరీంనగర్ ఎస్పీని బెదిరించిన సంజయ్ మీద సుమోటో కేసు పెట్టాలని కోరారు. బండి భగీరథ్‌ను కాపాడే ప్రయత్నం తండ్రి సంజయ్ చేశాడని ఆరోపించారు.
బాలిక కుటుంబాన్ని బ్లాక్ మెయిల్ చేయడానికి వంశీ అనే వ్యక్తితో ఫిర్యాదు చేయించారని పేర్కొన్నారు. బీజేపీ నాయకులు సంగప్ప బాలిక కుటుంబానికి,బండి.సంజయ్ కి సయోధ్య చేయడానికి ప్రయత్నం చేశాడని ఆరోపించారు. బండి సాయి , బాధితురాలి ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టీ వారి గౌరవానికి భంగం కలిగించారని అన్నారు.
కరీంనగర్లో బాధితులపైనే కేసు నమోదు చేయడం సిగ్టుచేటని విమర్శించారు. ముఖ్యమంత్రి నామ మాత్రపు సిట్ దర్యాప్తుకు ఆదేశించారని ఆరిపించారు. రేపులు, మర్డర్లు చేసే వ్యక్తులకు నోటీసులు ఇవ్వడం ఏ చట్టం ప్రకారమని రేవంత్, డీజీపీ చెప్పాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ ఇంటిని పోలీసులు ఎందుకు సోదాలు జరపడం లేదని నిలదీశారు. అసదుద్దీన్ ఓవైసీ మైనర్ బాలికపై అత్యాచారాన్ని ఖండించాలని కోరారు. మీడియాను గుప్పిట్లో పెట్టుకొని సంజయ్ కొడుకును కాపాడే ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ న్యాయ వ్యవస్థలను ప్రభావితం చేస్తున్నాయని ఆరోపించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

