జగిత్యాల రూరల్, ఫిబ్రవరి 8: జగిత్యాలలోని ప్రైవేట్ స్కూల్లో విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించిన టీచర్‌పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం జగిత్యాల రూరల్ పరిధిలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఆరో తరగతి విద్యార్థిని పట్ల ఓ టీచర్ శనివారం అసభ్యకరంగా ప్రవర్తించాడు. విద్యార్థిని తల్లిదండ్రులకు తెలుపడంతో వారు జగిత్యాల రూరల్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు టీచర్‌పై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రూరల్ ఎస్ఐ సదాకర్ తెలిపారు.
వేధింపుల టీచర్‌పై దాడి
జనగామ చౌరస్తా, ఫిబ్రవరి 8 : విద్యార్థినులతో కొంతకాలంగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడన్న కారణంతో జనగామ జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయుడికి శనివారం విద్యార్థినుల తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు. పోలీసులు ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.