హైదరబాద్ : తెలంగాణపై మోదీ ( Narendra Modi ) కి ఏ మాత్రం ప్రేమ లేదని, అవకాశం వచ్చినప్పుడల్లా రాష్ట్రంపై విరుచుకుపడుతున్నారని టీజీపీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రానంద్ ( Sumitranand ) విమర్శించారు. తెలంగాణ భవన్లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. తెలంగాణలో విభజన హామీలు నెరవేర్చకుండా కేంద్రం తాత్సరం చేస్తుందని ఆరోపించారు .
తెలంగాణకు మంచి జరిగే ఒక్క మాట కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడలేదని పేర్కొన్నారు. ఎన్నో అరాచకాలకు పాల్పడుతున్న రేవంత్ రెడ్డిని కేంద్ర మంత్రి ఎందుకు ప్రశ్నించడం లేదని అన్నారు. తెలంగాణలో బీజేపీ సర్కార్ నడుస్తోందని, బండి సంజయ్‌ను రేవంత్ రెడ్డి కాపాడు తున్నారని పేర్కొన్నారు.
బీజేపీకి, మోదీకి చిత్తశుద్ధి ఉంటే బండి సంజయ్‌ను బర్తరఫ్ చేయాలని, పోక్సో కేసులో మంత్రి కుమారుడు బండి భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేసి చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని విమర్శించారు. మైనర్ బాలిక వెనుక బీఆర్ఎస్ ఉందని దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు.