PM Modi | ప్రముఖ సామాజిక కార్యకర్త, పద్మశ్రీ వనజీవి రామయ్య తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనకు శనివారం గుండెపోటు రాగా.. కుటుంబీకులు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతి చెందారు. ఆయన మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. ‘దరిపల్లి రామయ్య గారు సుస్థిరత కోసం గళం వినిపించిన వ్యక్తిగా గుర్తుండిపోతారు. లక్షలాది చెట్లను నాటడానికి, వాటిని రక్షించడానికి ఆయన తన జీవితాన్ని అంకితమిచ్చారు. ఆయన అవిశ్రాంత కృషి ప్రకృతి పట్ల గాఢమైన ప్రేమనూ, భవిష్యత్తు తరాల పట్ల బాధ్యతను ప్రతిబింబిస్తాయి. ఆయన చేసిన కృషి మన యువతలో, మరింత సుస్థిరమైన హరిత గ్రహాన్ని నిర్మించాలనే తపనను ప్రేరేపిస్తూనే ఉంటుంది. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి’ అంటూ ట్వీట్ చేశారు.
రామయ్య స్వస్థలం ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామం. ఆయన తన జీవితమంతా మొక్కలు నాటడంతో పాటు పెంచుతూ వచ్చారు. ఇప్పటి వరకు కోటికిపైగా మొక్కలు నాటి రికార్డు సృష్టించారు. ‘వృక్షో రక్షతి రక్షితః’ అంటూ నిత్యం ప్రచారం చేస్తూ.. రోడ్ల పక్కన, పాఠశాలలు, దవాఖానలు, దేవాలయాల్లో మొక్కలు నాటారు. పర్యావరణానికి ఆయన చేసిన సేవలకు 2017లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. రామయ్యకు భార్య, ముగ్గురు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. కాగా ఇద్దరు కొడుకులు ఇప్పటికే పలు కారణాలతో మృతి చెందారు. కాగా, రామయ్య మృతితో ప్రకృతి ప్రేమికులు శోక సంద్రంలో మునిగిపోయారు.
దరిపల్లి రామయ్య గారు సుస్థిరత కోసం గళం వినిపించిన వ్యక్తిగా గుర్తుండిపోతారు. లక్షలాది చెట్లను నాటడానికి, వాటిని రక్షించడానికి ఆయన తన జీవితాన్ని అంకితమిచ్చారు. ఆయన అవిశ్రాంత కృషి ప్రకృతి పట్ల గాఢమైన ప్రేమనూ,భవిష్యత్తు తరాల పట్ల బాధ్యతను ప్రతిబింబిస్తాయి. ఆయన చేసిన కృషి మన యువతలో,…
— Narendra Modi (@narendramodi) April 12, 2025