హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): భాగ్యనగర్ టీఎన్జీవో గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీ ఇండ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో టీఎన్జీవో నేతలు ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావును కోరారు. గురువారం హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో టీఎన్జీవో నేతలు మంత్రి కేటీఆర్‌ను కలిశారు.
గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీ భూ సమస్య పెండింగ్‌లో ఉందని, ఆ స్థలాన్ని అప్పగించాలని కోరారు. దీనిపై మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. మంత్రిని కలిసినవారిలో టీఎన్జీవో కేంద్రం సంఘం అధ్యక్షుడు, ఉద్యోగ జేఏసీ చైర్మన్ మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్, అసోసియేట్ అధ్యక్షుడు ముత్యాల సత్యనారాయణగౌడ్
తదితరులు ఉన్నారు.