బాన్సువాడ, మార్చి 4: సొంత స్థలం ఉండి ఇండ్లు నిర్మించుకునే వారికి రూ.3 లక్షలు మంజూరు చేస్తామని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణం, రూరల్ గ్రామాల్లో డబుల్ బెడ్రూం ఇండ్ల పథకం కింద ఇండ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను శనివారం అందజేశారు. బాన్సువాడ నియోజకవర్గానికి 11 వేల డబుల్ ఇండ్లు మంజూరైనట్టు తెలిపారు. ఇందులో ఏడువేల ఇండ్లను లబ్ధిదారులు వారి సొంత స్థలంలో కట్టుకున్నారని చె ప్పారు. ఇప్పటికే 8 వేల ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, లబ్ధిదారులు గృహ ప్రవేశాలు కూడా చేశారని అన్నారు. కొత్తగా వలస వచ్చే వారికి, పొరుగు గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ నివాసం ఉండే వారికి బాన్సువాడలో డబుల్ బెడ్రూం ఇండ్లను ఇవ్వడం కుదరదని స్పీకర్ స్పష్టం చేశారు.