హైదరాబాద్, మే 19(నమస్తే తెలంగాణ) : ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈ హెచ్ఎస్) అమలు కోసం పెన్షనర్లు, ఉద్యోగులు ఈ నెల 31లోగా వివరాలు స మర్పించాలని సర్కార్ ఆదేశించింది. పూర్తి వివరాలను నిర్ణీత గడువులోగా ఐఎఫ్ఎంఎస్-హెచ్ఆర్ పోర్టల్లో అప్లోడ్ చేయాలని సూచించింది.
రిటైర్డ్ సీపీఎస్ ఉద్యోగుల డాటా సేకరించాలి: సీపీఎస్ఈయూ
ఈహెచ్ఎస్ స్కీమ్ అమల్లో భాగంగా రిటైర్డ్ సీపీఎస్ ఉద్యోగుల వివరాలు నమోదుచేయాలని తెలంగాణ సీపీఎస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ డిమాండ్ చేశారు. ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబసభ్యుల వివరాలు సేకరించడం శుభపరిణామమని, సీపీఎస్ విధానంలో రిటైర్డ్ అయిన వారి వివరాలు సేకరించకపోవడం శోచనీయమని వాపోయారు.