Fee Reimbursements | హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): ఇంజినీరింగ్ కాలేజీలకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించేలా ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేయాలంటూ పలు కాలేజీలు వేసిన వ్యాజ్యాలపై జస్టిస్ వేణుగోపాల్ మంగళవారం విచారణ జరిపారు. రీయింబర్స్మెంట్ కోసం ప్రభుత్వం బడ్జెట్లో రూ.1,500 కోట్లు కేటాయించినప్పటికీ కాలేజీలకు విడుదల చేయలేదని పిటిషనర్లు తెలిపారు. కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్కే రూ.56 కోట్ల బకాయి చెల్లించాల్సి ఉన్నదని చెప్పారు. సర్కార్కు నోటీసులు జారీచేసిన హైకోర్టు.. తదుపరి విచారణను మార్చి 10కి వాయిదా వేసింది.