KTR | జమ్ముకశ్మీర్‌లోని పెహల్గామ్లో ఉగ్రవాదులు సృష్టించిన నరమేధం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ క్రమంలో జమ్ముకశ్మీర్ పర్యటనకు వెళ్లి తెలంగాణకు చెందిన 80 మంది పర్యాటకులు నిన్నటి నుంచి శ్రీనగర్‌లో చిక్కుకుపోయారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకుని, వారిని సురక్షితంగా స్వగ్రామాలకు చేర్చేందుకు ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తెలంగాణ పర్యాటకులకు అవసరమైన సంరక్షణ, సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేటీఆర్ కోరారు. వారిని సురక్షితంగా ఇండ్లకు చేర్చాలని విజ్ఞప్తి చేశారు.
About 80 tourists from Telangana are stranded in Srinagar since yesterday. I request the State and Central Governments to swiftly make arrangements for their safe return. @TelanganaCMO, please ensure these tourists receive necessary care and support during this challenging… pic.twitter.com/bwYQJBmeWC
— KTR (@KTRBRS) April 23, 2025
కాగా, జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం (Pahalgam) లో పర్యటకులపై జరిగిన ఉగ్రదాడి (Terror Attack) పై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. భారత్‌పై కుట్ర పన్నుతున్న వారిని ఊరికే వదలబోమన్నారు. దాడికి భారత్ గట్టి బదులిస్తుందని హెచ్చరించారు. పహల్గాం ఉగ్రదాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఆ ఉగ్రదాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తంచేశారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించాలనేది భారత్ విధానమని, ఉగ్రవాదులను ఎదుర్కొనే విషయంలో దేశ ప్రజలంతా ఐక్యంగా ఉన్నారని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. తమ కుటుంబసభ్యులను కోల్పోయిన బాధిత కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. దాడికి పాల్పడిన వాళ్లను, కుట్ర పన్నిన వాళ్లను బయటకు లాగి తగిన బుద్ధి చెబుతామన్నారు.
ఉగ్రవాదానికి భారత్ తలొగ్గదు : అమిత్ షా
ఉగ్రవాదానికి భారత్ ఎన్నటికీ తలొగ్గదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) స్పష్టం చేశారు. ‘భారమైన హృదయంతో పెహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన వారికి అంతిమ నివాళులర్పిస్తున్నాను. భారత్ ఉగ్రవాదానికి తలొగ్గదు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని వదిలిపెట్టబోం’ అని షా తీవ్రంగా హెచ్చరించారు. ఈ మేరకు మృతులకు నివాళులర్పిస్తున్న ఫొటోలను ఎక్స్‌లో పోస్టు చేశారు.