పచ్చని పుడమికి వృక్షవేద్ అరణ్య
గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా మొకల పెంపకం, పర్యావరణహిత కార్యక్రమాలను చేపట్టిన రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్‌కుమార్ మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అస్సాంకు చెందిన ప్రముఖ ప్రకృతి ప్రేమికుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత జాదవ్పాయంగ్తో కలిసి అస్సాంలో ‘వృక్షవేద్ అరణ్య’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
- ప్రారంభించిన పద్మశ్రీ జాదవ్, మాజీ ఎంపీ సంతోష్‌కుమార్
- అస్సాంలోని జోర్హట్ అడవిలో పదివేల మొకలు నాటే ప్రణాళిక
హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా మొకల పెంపకం, పర్యావరణహిత కార్యక్రమాలను చేపట్టిన రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్‌కుమార్ మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అస్సాంకు చెందిన ప్రముఖ ప్రకృతి ప్రేమికుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత జాదవ్పాయంగ్తో కలిసి అస్సాంలో ‘వృక్షవేద్ అరణ్య’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
పచ్చని భవితకు బాటలు వేసి, పర్యావరణాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అస్సాంలోని జోర్హట్ అటవీ ప్రాంతం అరుణాచల ద్వీపంలో ఉన్న మొలాయికథోనిలో గురువారం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వృక్షవేద్ అరణ్యలో భాగంగా పదివేల మొకలు నాటబోతున్నట్టు జాదవ్పాయంగ్ వెల్లడించారు. కార్యక్రమంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ కో-ఫౌండర్ కరుణాకర్‌రెడ్డి, రితిరాజ్పుకాన్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జాదవ్పాయంగ్ మాట్లాడుతూ.. భవిష్యత్తు తరాలకు మనం అందించే అత్యంత విలువైన సంపద వృక్ష సంపద అని, వృక్షాలను కొట్టివేయకుండా పెంచాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. వృక్షాలు కూడా మనుషులలాగే జీవాలని, అవి తాము బతుకుతూ, మనకు బతుకును ఇస్తున్నాయని, వాటిని కాపాడుకోవడం ప్రతి మనిషి బాధ్యత అని చెప్పారు. గ్రీన్ఇండియా చాలెంజ్ ద్వారా సంతోష్‌కుమార్ పర్యావరణానికి చేస్తున్న కృషికి వెలకట్టలేమని కొనియాడారు. ప్రతి ఒకరూ మూడు మొకలు నాటాలంటూ సంతోష్‌కుమార్ చేస్తున్న ప్రయత్నం విజయవంతమైందని, దీనిని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని చెప్పారు.
చెట్లపై జాదవ్పాయంగ్ ప్రేమకు నిదర్శనం: సంతోష్‌కుమార్
జాదవ్పాయంగ్ వృక్ష వేద అరణ్య కార్యక్రమాన్ని ప్రారంభించడంపై మాజీ ఎంపీ సంతోష్‌కుమార్ సంతోషం వ్యక్తంచేశారు. చెట్లపై జాదవ్పాయంగ్కు ఉన్న ప్రేమకు నిదర్శనం ఈ కార్యక్రమం అని అభివర్ణించారు. పర్యావరణాన్ని కాపాడుకునేందుకు జరుగుతున్న ప్రయత్నంలో ప్రతిఒకరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasara holidays | గతంలో 10 రోజులు సెలవులు.. ఇప్పుడు కేవలం రెండు రోజులే..!
US Hindu Temple: అమెరికా గుడిలో కాల్పులకు ప్లాన్.. గన్ జామ్ కావడంతో తప్పిన ముప్పు.. టీనేజర్ అరెస్టు
Krithi Shetty | కృతి శెట్టి బాలీవుడ్ ఎంట్రీ.. రోహిత్ శెట్టి సమర్పణలో ‘హమ్ తేరే ప్యార్ మే’ ప్రారంభం!
Sathyavan Savithiri | లాయర్‌గా కీర్తి సురేష్.. ఆసక్తికరంగా ‘సత్యవాన్ సావిత్రి’ టీజర్!
Haindava Teaser | యూట్యూబ్‌లో దూసుకుపోతున్న ‘హైందవ’ టీజర్.. రికార్డు స్థాయిలో వ్యూస్‌తో మాస్ రెస్పాన్స్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

