హైదరాబాద్, జూన్ 23(నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సిటీ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నది. సుమారు 200 ఎకరాల్లో ఏఐ సిటీ ఏర్పాటు చేయనున్నట్టు సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే. మహేశ్వరం, శేరిలింగంపల్లి, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం తదితర ప్రాం తాల్లో ఔటర్ పక్కన ప్రభుత్వ భూములు గుర్తించినట్టు అధికావర్గాలు తెలిపాయి.
రాష్ట్ర ప్రభుత్వం జూలైలో హైదరాబాద్‌లో గ్లోబల్ ఏఐ సమ్మిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ సమ్మిట్‌కు ముందే ఏఐ సిటీకి శంకుస్థాపన చేయాలని భావిస్తున్నది. తద్వారా సదస్సుకు హాజరయ్యే వివిధ కంపెనీల ప్రతినిధులకు ఏఐ సిటీని ప్రత్యక్షంగా చూపించే అవకాశం కలుగుతుందనేది ప్రభు త్వ ఉద్దేశంగా ఉన్నది. ఏఐ సిటీకి సమీపంలోనే స్కిల్ యూనివర్శిటీని కూడా నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్నది.