Pittala Ravinder | మత్స్య సమాఖ్య చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన పిట్టల రవీందర్
Pittala Ravinder | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మత్స్య, సహకార సంఘాల సమాఖ్య చైర్మన్‌గా పిట్టల రవీందర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. మాసబ్‌ట్యాంక్‌లోని మత్స్య శాఖ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని రవీందర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
Pittala Ravinder | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మత్స్య, సహకార సంఘాల సమాఖ్య చైర్మన్‌గా పిట్టల రవీందర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. మాసబ్‌ట్యాంక్‌లోని మత్స్య శాఖ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని రవీందర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను మంత్రి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ముదిరాజ్, ఆయా కార్పొరేషన్ల చైర్మన్లు దూదిమెట్ల బాలరాజు యాదవ్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, దామోదర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ఉద్యమకారుడు, మత్స్యరంగ నిపుణుడు, జర్నలిస్ట్ పిట్టల రవీందర్‌ను తెలంగాణ రాష్ట్ర మత్స్య, సహకార సంఘాల సమాఖ్య చైర్మన్‌గా ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించిన సంగతి తెలిసిందే. వైస్ చైర్మన్‌గా గంగపుత్ర సంఘాల సీనియర్ నాయకుడు దీటి మల్లయ్య నియమితులయ్యారు.
కరీంనగర్ జిల్లా వీణవంకకు చెందిన పిట్టల రవీందర్ సుదీర్ఘకాలం జర్నలిస్టుగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో కో-కన్వీనర్‌గా వ్యవహరించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా రామాంతపూర్‌కు చెందిన దీటి మల్లయ్య ఉద్యమకారుడిగా, మత్స్యరంగ నిపుణుడిగా విశేష సేవలు అందించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

