మహబూబ్‌నగర్ : సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్( Kodangal ) లో భూమి కోసం పోరాటం చేసిన లగచర్ల ( Lagacharla) బీఆర్ఎస్ ( BRS ) కు జై కొట్టింది. అధికార పార్టీ ఎన్ని ప్రలోభాలు పెట్టిన అక్కడి గిరిజనులు తమకు ఆపదగా నిలిచిన బీఆర్ఎస్కు జేజేలు పలికారు. దుద్యాల మండలంలోని సత్తారుకుంట తండాలో మూడవత్ పూజ( Puja) , రోటిబండ తండాలో రుక్కమ్మ ( Rukmamma) బీఆర్ఎస్ మద్దతుతో విజయం సాధించారు.
లగచర్ల, హకీంపేట గ్రామపంచాయతీల్లో కాంగ్రెస్ ఎదురీదుతుంది. సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఇక్కడి భూములను చెరబడుతూ గిరిజనులను తరిమికొట్టే విధంగా ఫార్మ క్లస్టర్‌కు బీజం వేసిన దానిపై లగచర్ల చారిత్రాత్మక పోరాటం జాతీయస్థాయిని ఆకర్షించింది.
ఈ పోరాటం నేపథ్యంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యుల స్థానాలను బీఆర్ఎస్ మద్దతుదారులే గెలుపొందారు. ఇక్కడి భూభాధితుల పోరాటానికి మద్దతు పలికిన బీఆర్ఎస్కు గిరిజన తండాలు జై కొట్టాయి. ఇప్పటికే రెండు చోట్ల సర్పంచ్ స్థానాలను బీఆర్ఎస్ మద్దతుదారులు గెలుపొందగా మరో రెండుచోట్ల విజయం వైపు దూసుకెళుతున్నారు.
కాంగ్రెస్ మద్దతుదారురాలు, సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్యా యత్నం
సీఎం నియోజకవర్గంలో కాంగ్రెస్ మద్దతుదారురాలిగా పోటీ చేసిన సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం సృష్టించింది. కొడంగల్ మండలంలోని కాజా అహ్మద్పల్లిలో లో సర్పంచ్ అభ్యర్థిగా (కాంగ్రెస్)పోటీ చేసిన తెలుగు లక్ష్మి ఆత్మహత్యాయత్నం( Suicide Attempt) చేసుకోవడం సంచలనంగా మారింది. ఆమె ఎందుకు అగాయిత్యానికి పాల్పడిందో వివరాలు తెలియాల్సి ఉంది.