హైదరాబాద్, జనవరి 23, (నమస్తే తెలంగాణ) : ఓఆర్ఎస్ను శక్తిపానీయాలంటూ తప్పుడు ప్రకటనలతో అమ్మకాలు జరగటంపై దాఖలైన పిల్లో హైకోర్టు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చింది. ఓఆర్ఎస్ విక్రయాలపై పూర్తి వివరాలతో ఫిబ్రవరి 28లోగా కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ కేసులో తమను ప్రతివాదిగా చేర్చాలం టూ ఎండోక్రైన్ సొసైటీ ఆఫ్ ఇండియా దాఖ లు చేసిన ఇంప్లీడ్ పిటిషన్‌ను ధర్మాసనం అ నుమతించింది. ఓఆర్ఎస్ విక్రయాల్లో కేం ద్ర ఆహారభద్రత, ఆహార ప్రమాణాల మండ లి జారీచేసిన అమలు కావడం లేదంటూ హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ ఎం శివరంజని 2022లో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిని తాతాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్‌పాల్, జస్టిస్ రాధారాణితో కూడిన ద్విసభ్య ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. ప్రతివాదులైన ఎఫ్ఎస్ఎస్ఏఐ, సీడీఎస్‌సీవో, డ్రగ్స్ కంట్రోలర్, రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ, డీజీపీలతోపాటు జాన్సన్ అండ్ జాన్సన్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, అమృతాంజన్ హెల్త్‌కేర్, స్టేపిట్ హెల్త్ అండ్ ఫిట్నెస్ వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్‌లకు నోటీసులు జారీచేసింది.
హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ) : రోడ్లపై గుంతల వల్ల ఎదురయ్యే సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు, వాటిపై స్పందించి మరమ్మతు చర్యలు తీసుకోవడానికి వీలుగా యాప్‌ను రూపొందించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పంచాయతీరాజ్ శాఖ, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలకు నాలుగు వారాల గడువు ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఆర్అండ్బీ రూ పొందించిన ‘టీ రాస్తా’లాంటి యాప్‌ను రూ పొందించాలని సూచించింది. విచారణను ఫిబ్రవరి 20వ తేదీకి వాయిదా వేసింది.