2న ఫొటో ఎగ్జిబిషన్
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమాల్లో భాగంగా జూన్ 1న సాయంత్రం పబ్లిక్ గార్డెన్‌లోని గన్‌పార్క్ అమరవీరుల స్తూపం నుంచి సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న అమరజ్యోతి వరకు పదివేల మందితో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టనున్నట్టు మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తెలిపారు.
- జూన్ 1న 10 వేల మందితో ర్యాలీ
- గన్‌పార్క్ నుంచి ప్రారంభం
- హాజరుకానున్న కేసీఆర్
- మాజీ ఎమ్మెల్సీ కర్నె వెల్లడి
హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమాల్లో భాగంగా జూన్ 1న సాయంత్రం పబ్లిక్ గార్డెన్‌లోని గన్‌పార్క్ అమరవీరుల స్తూపం నుంచి సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న అమరజ్యోతి వరకు పదివేల మందితో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టనున్నట్టు మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తెలిపారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే దశాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమాలపై బుధవారం తెలంగాణభవన్‌లో పలువురు నాయకులు సమావేశమై చర్చించారు.
ఈ వివరాలను మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌తో కలిసి ఆయన మీడియాకు వెల్లడించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దశాబ్ది ముగింపు ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని, జూన్ 1న గన్పార్ అమరవీరుల స్తూపం వద్ద కేసీఆర్ నివాళులర్పిస్తారని, అనంతరం అక్కడి నుంచి ర్యాలీ తీస్తామని, వెయ్యిమంది కళాకారులు ర్యాలీలో ప్రదర్శనలు ఇస్తారని తెలిపారు. 2న తెలంగాణ భవన్లో జాతీయ జెండా, పార్టీ జెండాను కేసీఆర్ ఎగురవేస్తారని, అనంతరం పార్టీ ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగిస్తారని చెప్పారు. కళింగ ఫంక్షన్హాల్లో ఉద్యమయాది పేరిట ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. 3న జిల్లా పార్టీ కార్యాలయాల్లో జాతీయ జెండా, పార్టీ జెండాలను జిల్లా అధ్యక్షులు ఎగురవేస్తారని, అదేరోజు దవాఖానలు, అనాథ శరణాలయాల్లో స్వీట్లు, పండ్ల పంపిణీ కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. సమావేశంలో మాజీ ఎమ్మె ల్సీ ఎం శ్రీనివాస్‌రెడ్డి, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు దేవీప్రసాద్, వాసుదేవరెడ్డి, శ్రీనివాస్‌యాదవ్, సతీశ్‌రెడ్డి, ఎంఎన్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
కాంగ్రెస్ సర్కార్‌ది సంకుచిత బుద్ధి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

