నాంపల్లి కోర్టులు, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): ఫోన్ల ట్యాపింగ్ కేసులో రిమాండ్ ఖైదీలుగా కొనసాగుతున్న మాజీ పోలీస్ అధికారులు ప్రణీత్‌రావు, తిరుపతన్న, రాధాకిషన్‌రావును సోమవారం చంచల్‌గూడ జైలు అధికారులు నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు.
మరో నిందితుడు భుజంగరావు తన న్యాయవాది ద్వారా కోర్టుకు గైర్హాజరు పిటిషన్‌ను సమర్పించారు. 14వ అదనపు చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్.. తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదావేశారు.