హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ) : ఫోన్ ట్యా పింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభాకర్‌రావు విచారణ గురువారం ముగిసింది. ఇదే వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతర అధికారులతో కలిపి ప్రభాకర్‌రావును సిట్ విచారించినట్టు తెలిసింది. తదుపరి కార్యాచరణపై సిట్ కొత్త చీఫ్ సజ్జనార్‌తో ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్‌కుమార్ భేటీ అ య్యారు. నెల రోజుల్లో విచారణ పూ ర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించడంపై భేటీలో చర్చించినట్టు సమాచారం.
హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): బీసీల ఐక్యతే బలంగా.. అధికారమే లక్ష్యంగా అనే నినాదంతో 28న హైదరాబాద్‌లోని డీర్పార్లో బీసీ జన భోజనాల మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ వెల్లడించారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. జనాభాలో 60శాతానికి పైగా ఉన్న బీసీలు గత 80 ఏండ్లుగా రాజకీయ అధికారాన్ని అందుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. 136 కులాలుగా ఉన్న బీసీలు సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. బీసీలు బలపడడానికి జన భోజన మహోత్సవాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. బీసీలంతా పార్టీలకతీతంగా హాజరుకావాలని కోరారు.