వరంగల్: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తండ్రి మందలించాడని ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదకర సంఘటన సంగెం మండలం మొండ్రాయి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
గ్రామానికి చెందిన ఫార్మసీ విద్యార్థిని చెవ్వ నిఖిత తండ్రి మందలించాడని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కాగా, మృతురాలు నిఖిత ఫార్మసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నది. నిఖిత మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సంగెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.