Pharma Companies | హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ) : ఫార్మాసిటీలోనే ఆరు ఫార్మా కంపెనీల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కాలుష్యరహితంగా గ్రీన్ ఫార్మా కంపెనీలను నెలకొల్పేందుకు రాష్ట్రప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకున్నది. ఎంఎస్ఎన్ గ్రూప్, లారస్ ల్యాబ్స్, గ్లాండ్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ లాబోరేటరీస్, అరబిందో ఫార్మా, హెటిరో ల్యాబ్స్ కంపెనీలతో శుక్రవారం ఈ అవగాహన ఒప్పందాలు జరిగాయి. కంపెనీలు తమ నిర్మాణ ప నులు చేపట్టేందుకు వీలుగా నాలుగు నెలల్లో స్థలాల కేటాయింపుతోపాటు, అవసరమైన స దుపాయాలను కల్పించాలని సంబంధిత అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఈ ఆరు కంపెనీలు దాదాపు రూ.5,260 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నాయి. వీటి ద్వారా ఫార్మా రంగంలో 12,490 మందికి ఉద్యోగా లు లభిస్తాయి. టీఎస్ఐఐసీ చైర్మపర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, విష్ణువర్ధన్‌రెడ్డి, రెడ్డీస్ ల్యాబ్స్ డైరెక్టర్ సతీశ్‌రెడ్డి, లారస్ ల్యాబ్స్ ఈడీ వీవీ రవికుమార్, గ్లాం డ్ ఫార్మా సీఈవో శ్రీనివాస్, ఎంఎస్ ల్యాబ్స్ సీఎండీ ఎంఎస్ఎన్ రెడ్డి, అరబిందో డైరెక్టర్ మదన్‌మోహన్‌రెడ్డి, హెటిరో గ్రూప్ ఎండీ వంశీకృష్ణ పాల్గొన్నారు.
ఎంవోయూల ఒప్పందాల ప్రకారం ఎంఎస్ఎన్ లాబోరేటరీ ఫార్మాసిటీలో మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌తోపాటు ఆర్ అండ్ డీ సెం టర్ నెలకొల్పనున్నది. లారస్ ల్యాబ్స్, అరబిందో ఫార్మా ఫార్ములేషన్ యూనిట్లు నెలకొల్పుతాయి. గ్లాండ్ పార్మా ఆర్అండ్డీ సెంట ర్, ఇంజెక్టబుల్స్, డ్రగ్ సబ్స్టన్స్ మాన్యుఫాక్చర్, డాక్టర్ రెడీస్ లాబ్స్ ఇంజెక్టబుల్, బయో సిమిలర్ల యూనిట్ ఏర్పాటు చేస్తుంది. హెటి రో ల్యాబ్స్ ఫినిష్డ్ డోస్, ఇంజక్టబుల్ తయా రీ పరిశ్రమను నెలకొల్పనున్నది.
దాదాపు 11 నెలలుగా ఫార్మాసిటీపై హై డ్రామా కొనసాగిస్తున్నది. అధికారంలోకి రా గానే ‘ఫార్మాసిటీ’ని రద్దు చేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఆ తర్వాత అక్కడ ఫోర్త్ సిటీని నిర్మిస్తామంటూ హడావుడి చేశా రు. ఫార్మా కంపెనీల కోసం 10 ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేస్తామంటూ నోటిఫికేషన్లు కూడా ఇచ్చారు. దీంతో అటు పార్మా సిటీకి భూ ములు ఇచ్చిన రైతులు, ఇటు ఫార్మా క్లస్టర్లతో భూములు కోల్పోయే రైతులు ప్రభుత్వంపై తిరగబడ్డారు. ఫార్మాసిటీ రైతులు ఏకంగా కో ర్టు మెట్లెక్కారు. దీంతో ‘ఫార్మాసిటీని కొనసాగిస్తాం’ అని కోర్టు ముందు ప్రభుత్వం ఒప్పుకోక తప్పలేదు. మరోవైపు ఫార్మా క్లస్టర్ ఏర్పాటుపై లగచర్లలో భూసేకరణ అంశం విమర్శలకు దారితీసింది. ఈ అంశంపై జాతీయ స్థా యిలో రాష్ట్ర ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నా రు. ఈ నేపథ్యంలో ఫార్మా క్లస్టర్ల ఏర్పాటుపై ప్రభుత్వం వెనుకడుగు వేసిందని ప్రచారం జరుగుతున్నది. దీనిని నిర్ధారించేలా ఫార్మాసిటీలో కంపెనీలకు భూములు కేటాయించారు. దీంతో ఫార్మాసిటీకి లైన్‌క్లియర్ అయినట్టేనని చెప్తున్నారు. ఇదిలా ఉండగా సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పా టు పనులను సీఎం పరిశీలించారు. సౌత్ కరోలినా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ జేఏ ఏరియల్ మూర్ సీఎంని కలిశారు.
హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): ఫ్యూచర్‌సిటీ, ఏఐసిటీ లాం టి వినూత్న ప్రాజెక్టులతో హైదరాబాద్ సమీప భవిష్యత్తులో గ్లోబల్ లీడర్‌గా అవతరించనున్నదని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. హైదరాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన కామన్వెల్త్ మేడ్-ఆర్బ్ కాన్ఫరెన్స్-24లో ఆయన పాల్గొని మా ట్లాడారు. సాఫ్ట్వేర్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, బయో టెక్నాలజీతో హైదరాబాద్ పరిశ్రమల హబ్‌గా గుర్తింపు పొందిందని తెలిపారు. ప్రజాస్వామ్యానికి న్యాయవ్యవస్థ మూలస్తంభమని, ప్రస్తుతం కోర్టుల్లో భారీగా కేసులు పెండింగ్‌లో ఉండటం న్యాయవ్యవస్థకు సవాల్‌గా మారిందని చెప్పారు. మధ్యవర్తిత్వం ద్వారా కేసుల పరిష్కారానికి కృషి చేస్తున్న ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్‌ను సీఎం అభినందించారు. సామాన్యులకు ఐఏఎంసీ సేవలందించాలని కోరారు. ఆర్బిట్రేషన్ మ్యాపులో లండన్, సింగపూర్ తర్వాత హైదరాబాద్ ఉండటం మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు.