పెట్రో ధరలను నియంత్రించాలి
పెట్రోల్, డీజిల్, సహజవాయువు ధరలు ఇబ్బడిముబ్బడిగా పెరుగకుండా నియంత్రణ చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
- వినియోగదారులకు అందుబాటులో ఉంచాలి
- స్థాయీ సంఘం సమావేశంలో ఎంపీ వద్దిరాజు
హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ) : పెట్రోల్, డీజిల్, సహజవాయువు ధరలు ఇబ్బడిముబ్బడిగా పెరుగకుండా నియంత్రణ చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కేంద్రాన్ని డిమాండ్ చేశారు. పెట్రో ఉత్పత్తులు వినియోగదారులకు అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు. గురువారం ఢిల్లీలో పెట్రోలియం, సహజవాయువుశాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం చైర్మన్ తట్కారే సునీల్ దత్తాత్రే అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నది. ఈ సందర్భంగా వద్దిరాజు మాట్లాడుతూ.. సంక్షోభ సమయంలో వినియోగదారులకు నాణ్యతతో కూడిన సేవలందించడమే మన ముందున్న అతిపెద్ద సవాల్ అని పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ కొరతతో తెలుగు రాష్ట్రాల్లోని వినియోగదారుల ఇబ్బందులపై అధికారులతో మాట్లాడి పరిష్కరించినట్టు గుర్తుచేశారు. పెట్రోల్, డీజిల్ నిల్వల దిగుమతి, రవాణా, సరఫరా సందర్భాల్లో వ్యర్థాలను అరికట్టాలని, ప్రమాదాలు జరుగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించినట్టు వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

