హైదరాబాద్, అక్టోబర్ 15, (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థలకు వెంటనే ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ హైకోర్టులో బుధవారం పిటిషన్ దాఖలైంది. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలం కొత్త కొమ్ముగూడెం గ్రామానికి చెందిన రెంక సురేందర్ ఈ పిటిషన్ను దాఖలు చేశారు. బీసీ రిజర్వేషన్లను 25 శాతం నుంచి 42 శాతానికి పెంచుతూ ప్రభుత్వం జారీచేసిన జీవో 9 అమలును మాత్రమే హైకోర్టు నిలిపివేసిందని, ఎన్నికల ప్రక్రియను నిలిపివేయలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది నలిమెల వెంకటయ్య పేరొన్నారు. ఈ పిటిషన్ను హైకోర్టు శుక్రవారం విచారించే అవకాశం ఉన్నది.