6వేల పింఛన్ ఎప్పుడిస్తరు సారూ?
‘రూ.6 వేల పింఛన్ ఇస్తామని చెప్పారు.. ఎప్పుడిస్తారు సార్'.. అంటూ ఎమ్మెల్యేను ఓ దివ్యాంగుడు నిలదీసిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటుచేసుకున్నది.
- ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డిని ప్రశ్నించిన దివ్యాంగుడు
- తన చేతుల్లో ఏమీ లేదని చేతులెత్తేసి..ముఖ్యమంత్రిని అడుగాలన్న ఎమ్మెల్యే
నవాబ్‌పేట, అక్టోబర్ 28 : ‘రూ.6 వేల పింఛన్ ఇస్తామని చెప్పారు.. ఎప్పుడిస్తారు సార్’.. అంటూ ఎమ్మెల్యేను ఓ దివ్యాంగుడు నిలదీసిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటుచేసుకున్నది. నవాబ్‌పేట మండలం లింగంపల్లిలో బుధవారం స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి హాజరయ్యారు.
ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన దివ్యాంగుడు రమేశ్.. ఎమ్మెల్యే వద్దకు వెళ్లి ఎన్నికల సమయంలో తమకు రూ.6 వేల పింఛన్ అందిస్తామని చెప్పారు.. అధికారం చేపట్టి మూడేండ్లు పూర్తయింది.. ఇప్పటి వరకు ఇయ్యక పోతిరి.. ఎప్పుడు ఇస్తారంటూ ప్రశ్నించాడు. రైతుబంధు, రైతుబీమా కూడా సక్రమంగా ఇవ్వడంలేదంటూ ఆవేదన వ్యక్తంచేశాడు. ఎమ్మెల్యే స్పందిస్తూ.. ‘పింఛన్లు పెంచడం నా చేతుల్లో ఏమీ లేదు.. ఎమ్మెల్యేలందరం కలిసి సీఎంను అడగాలి.. నేనొక్కడినే అడిగితే సీఎం వద్ద మైనస్ అవుతున్నా.. ఏది ఇవ్వాలన్నా సీఎం వద్దనే ఉంటుంది.. నేనేమీ చేయలేను’ అని సమాధానం ఇస్తూ అక్కడినుంచి జారుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

