హైదరాబాద్ : మెదక్ జిల్లాలో( Medak district) ఎలుగుబంటి దాడిలో(Bear attack) ఓ వ్యక్తి తీవ్రంగా (Person seriously injured ) గాయపడ్డాడు. ఈ విషాదకర సంఘటన హవేళిఘన్పూర్ మండలం దూపిసింగ్ తండాలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తండాకు చెందిన రవి అనే వ్యక్తి తన పొలంలో పనులు చేసుకుంటుండగా ఎలుగుబంటి ఒక్కసారిగా అతడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. గుర్తించిన స్థానికులు వెంటనే బాధితుడిని హాస్పిటల్కు తరలించారు.
గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. కాగా, ఎలుగుబంటి సంచారంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ఎలుగుబంటి ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి త్వరగా ఎలుగుబంటిని బంధించాలని కోరుతున్నారు.
Also Read..