హైదరాబాద్, నవంబర్ 19(నమస్తేతెలంగాణ): రాష్ట్రంలోని మత్స్యకార సహకార సంఘాలకు పర్స న్ ఇన్చార్జిలను కొనసాగించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. తాజాగా మధ్యంతర ఉత్తర్వు లు జారీచేసింది. హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, భూపాలపల్లి, వనపర్తి, సిద్దిపేట, యా దాద్రి, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల మత్స్యకార సహకార సంఘాలకు చీఫ్ ప్రమోటర్లు/పర్సన్ ఇన్చార్జిలను నేరుగా నియమించేందుకు సెప్టెంబర్ 3న ప్రభుత్వం జీవో 60 జారీ చేసింది. దాన్ని సవాలు చేస్తూ 10మంది హైకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్పై జస్టిస్ టీ మాధవీదేవి బుధవారం విచారణ చేపట్టారు. ఆగస్టులో హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులకు జీవో 60 పూర్తి విరుద్ధంగా ఉన్నదని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. దీనిపై ప్ర భుత్వ న్యాయవాది స్పందిస్తూ.. ఆ 9 జిల్లాల సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించలేదని తెలిపారు. ఆ 9 జిల్లాలకు చీఫ్ ప్రమోటర్లు/పర్సన్ ఇన్చార్జిలుగా పిటిషనర్లను కొనసాగించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 16కు వాయిదా వేసింది.