వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం : మంత్రి తలసాని
హైదరాబాద్ : వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. సోమవారం ఖైరతాబాద్, ముషీరాబాద్, అంబర్ పేట నియోజకవర్గాల పరిధిలో ఎస్ఎన్డీపీ కార్యక్రమం క్రింద చేపట్టిన నాలాల అభివృద్ధి పనులు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వరద ముంపునకు కారణమైన నాలాలపై ఉన్నఅక్రమ నిర్మాణాలను తొలగిస్తామన్నారు. ప్రతి ఏటా వర్షాకాలంలో నాలాకు ఎగువ నుంచి వచ్చే వరదతోముంపునకు గురవుతున్న నాలా పరిసర కాలనీలు, బస్తీలు దీర్ఘకాలికంగా ఉన్న సమస్యకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు.. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ఎస్ఎన్డీపీ కార్యక్రమంతో శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. వరదలు వచ్చిన సమయంలో జరుగుతున్న ఆస్తి, ప్రాణ నష్టాన్ని నివారించేందుకు శాశ్వత చర్యల తీసుకుంటామని, ఇందుకు ఎన్ని కోట్ల నిధులైనా ఖర్చు చేస్తామని, ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయమన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

