e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 17, 2021
Home News డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం : మంత్రి ఐకే రెడ్డి

డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం : మంత్రి ఐకే రెడ్డి

నిర్మల్ : డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చేపడుతామని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. నిర్మల్‌ పట్టణంలోని శివాజీ చౌక్ వద్ద జరుగుతున్న వ్యర్థాల తొలగింపు పనులను గురువారం మంత్రి మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, మున్సిపల్ అధికారులతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుత.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మోరీల్లో చెత్తా చెదారం పేరుకుపోయిందన్నారు.
వ్యర్థాలను తొలగించి నూతనంగా మురికి కాలువలు నిర్మించి శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బాలక్రిష్ణ, ఎఫ్‌ఎస్‌సీఎస్‌ చైర్మన్ ధర్మజి రాజేందర్, టౌన్ ప్రెసిడెంట్ మరుగొండ రాము, విప్ నెరేళ్ల వేణు, మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు తదితరులు ఉన్నారు.

- Advertisement -

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana